చెర్రీ విష్.. అభయ్ దిల్ ఖుష్.
on Jul 23, 2018
సినిమా ఇండస్ట్రీ లో అభిమానుల చొరవ సంపాదించటం అంత తేలికేం కాదు.కానీ చిన్న వయస్సులోనే పాపులర్ అవుతున్నారు మన స్టార్ కిడ్స్.తల్లి తండ్రులు స్టార్స్ అయితే వారిమీద చూపించే అభిమానమే వారి పిల్లల మీద కూడా చూపిస్తున్నారు మన తెలుగు ప్రజలు. ఈ లిస్టు లో మన టాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలు కూడా ఉన్నారు.ఈమధ్యనే ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ తన పుట్టినరోజును జరుపుకున్నాడు.అభయ్ రామ్ పుట్టిన రోజునాడు బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియాలో దుమ్ములేపారు అభిమానులు. స్టార్ హీరోలు కూడా అభయ్ కి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఇప్పటికే మా మధ్య పోటీ ఉంటూనే ఉంటుంది,అయితే ఆ పోటీ చిత్రాలకు మాత్రమేగాని వ్యక్తిగత జీవితం లో కాదు అని మన స్టార్ హీరోస్ ఓ క్లారిటీ ఇచ్చేసారు.అందుకు నిదర్శనం మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్ర ఆడియో కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రావటం... మహేష్‌ని అన్న అని ఆప్యాయంగా సంబోదించటంతో పాటు వారి మధ్య స్నేహబంధం ఉందని అందరికి తెలియజేసారు.ఇకపోతే రామ్ చరణ్,ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో కూడా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే.వారిద్దరూ రాజమౌళి మల్టిస్టారర్ లో కలిసి నటించబోతున్నారు కూడా.తాజాగా చరణ్ ఒక వీడియో ద్వారా అభయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.అభయ్ కి శుభాంక్షలు తెలపడమే కాకుండా తనకోసం ఒక మంచి గిఫ్ట్ ను పంపానని నాన్ననడిగి తీసుకోమని చెప్పాడు. ఆ బహుమతి నచ్చుతుందని అనుకుంటున్నానని ,బర్త్ డే ఎంజాయ్ చెయ్యమని చెప్పాడు.
దీనికి బదులుగా అభయ్ కి గిఫ్ట్ నచ్చిందని ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు.అభయ్ కే కాదు ఈమధ్యనే పుట్టిన రోజు జరుపుకున్న మహేష్ బాబు ముద్దుల కూతురు సితారకు కూడా చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే.చరణ్,మహేష్,ఎన్టీఆర్ ల ఫ్రెండ్షిప్,వారి ఫ్యామిలీల మధ్య అనుబంధం అభిమానులకు ఓ కొత్త అనుభూతునిస్తుంది.వీరంతా ఎప్పుడు సమయం దొరికినా కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.మొత్తానికి అభిమానులకు ఓ మంచి సందేశం ఇస్తున్నారు వీరి స్నేహంతో.