'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ కాపీనా?
on Jul 10, 2020
సామాజిక మాధ్యమాలలో నవతరం చాలా చురుగ్గా ఉంటోంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్... కొత్త సినిమాలకు సంబంధించి ఏది విడుదలైనా సరే? అటువంటి పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లను చూపిస్తూ... అచ్చం అలాగే ఉందని చెబుతున్నారు. కాపీ కొట్టారేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న 'రాధే శ్యామ్' అటువంటి సందేహాల నుండి బయట పడలేకపోయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇలా విడుదలైందో? లేదో? అలా పాత సినిమా పోస్టర్లు వచ్చాయి.
వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన 'కంచె' సినిమా గుర్తుంది కదా? అందులో 'నిజమేనని నమ్మనీ...' అని ఒక పాట ఉంటుంది. అందులో హీరో హీరోయిన్ల స్టిల్, 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ ఒకేలా ఉన్నాయని కొందరు అంటున్నారు. మరికొందరు హిందీ సినిమా 'బాజీరావ్ మస్తానీ'లో రణవీర్ సింగ్, దీపికా పదుకొనె స్టిల్ టైపులో ఉందని అంటున్నారు. జస్ట్... హీరో హీరోయిన్లు జంటగా ఉన్న స్టిల్ చూసి పోలీకలు తీసుకు రావడం సబబు కాదు. కానీ, నెటిజన్లు మాత్రం ఆగడం లేదు. ఆఖరికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'సాక్ష్యం'లో స్టిల్ కూడా బయటకు తీశారు. యూరప్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై సినిమాలకు భిన్నంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు.