అంధాధున్ రీమేక్‌లో రాశీఖన్నా?
on Jan 25, 2021
వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత మరో తెలుగు చిత్రానికి సంతకం చేయని ఉత్తరాది భామ రాశీఖన్నా.. ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తుగ్లక్ దర్బార్, సైతాన్ కా బచ్చా, మేథావి, అరణ్ మణై 3.. పేర్లతో రూపొందుతున్న ఈ నాలుగు కోలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నాయి. ఇదిలా ఉంటే.. మూడేళ్ళ క్రితం సూపర్ స్టార్ మోహన్ లాల్, విశాల్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం విలన్ లో ఓ నాయికగా నటించిన రాశీఖన్నా.. తాజాగా మరో మాలీవుడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఈ సారి మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కి జోడీగా రాశి దర్శనమివ్వనుందట. అంతేకాదు.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అంధాధున్ కి రీమేక్ గా ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవి కె. చంద్రన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారని, ఇందులో టబు పోషించిన పాత్రలో మమతా మోహన్ దాస్ కనిపించే అవకాశముందని సమాచారం.
మరి.. అంధాధున్ రీమేక్ తరువాత రాశీఖన్నా మలయాళ చిత్ర సీమలోనూ బిజీగా మారుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
