`ఆర్ ఆర్ ఆర్` లేటెస్ట్ అప్డేట్!!
on Jan 16, 2019
ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మహా మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని ఏస్ డైరక్టర్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇటీవల జక్కన్న తనయుడు వివాహం సందర్భంగా కొంత బ్రేక్ ఇచ్చారు. అందులో వినయ విధేయ రామ చిత్రం ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ కూడా బిజీ గా ఉన్నాడు. ఇక ఇపుడు రామ్ చరణ్ కూడా ఫ్రీ అయ్యాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ 16 అయిపోతుంది..కాబట్టి ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్ ను ఈ నెల 21న నుంచి ప్రారంభించడానికి ఇప్పటికే చిత్ర యూనిట్ సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని , రాహుల్ రామకృష్ణ ఇంపార్టెన్స్ పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 300 కోట్లు భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగుతో పాటు తమిళ, హిందీ , మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.