వర్మ మరో ఆఫర్.. ఈసారి పది లక్షలిస్తాడట.!!
on Oct 16, 2018
ఆఫీసర్ తరువాత కాస్త సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ మళ్ళీ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో బాలకృష్ణ 'ఎన్టీఆర్ బయోపిక్' అనౌన్స్ చేసిన సమయంలో.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ సినిమా అనౌన్స్ చేసి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసారు. తరువాత ఏమైందో కానీ వర్మ సైలెంట్ అయ్యారు. దీంతో ఇక 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కూడా అనౌన్సమెంట్ వరకే పరిమితం అనుకున్నారు. కానీ అనుహ్యంగా వర్మ ఈ నెల 19 న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఓపెనింగ్ ఉంటుందంటూ షాక్ ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబుని పోలి ఉన్న వ్యక్తి వీడియోని షేర్ చేసి ఇతని వివరాలు చెప్తే లక్ష ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. అనుకున్నట్టే అతని వివరాలు తెలిసాయి.. వివరాలు తెలిపిన వారికి లక్ష రూపాయిలు కూడా ఇచ్చినట్టు సమాచారం. అంతటితో ఆగితే ఆయన వర్మ ఎందుకు అవుతారు. ఇదే హీట్ ని కంటిన్యూ చేస్తూ మరో ఆఫర్ ప్రకటించారు. ఈసారి ఎన్టీఆర్ ని పోలిన వ్యక్తి వీడియో పంపితే పదిలక్షలు ఇస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఎన్టీఆర్ పోలికలతో ఉండి.. ఆయనలాగా డైలాగ్స్ చెప్పగలిగే వ్యక్తులకు సంబంధించిన వీడియోలు తనకు పంపాలని.. అందులో తాను కోరుకున్నట్లు ఎవరైనా ఉంటే.. వీడియో పంపిన వాళ్లకు రూ.10 లక్షలు ఇస్తానని ప్రకటించాడు. ఇప్పటికే తాను ఎన్టీఆర్ పాత్ర కోసం ముగ్గురిని ఫైనలైజ్ చేశానని.. కానీ తనకు ది బెస్ట్ కావాలని అందుకే ఈ ప్రయత్నం అని వర్మ పోస్ట్ లో పేర్కొన్నారు.
Also Read