లేడీ జేమ్స్ బాండ్ గా ప్రియాంక చోప్రా..?
on May 25, 2016
ప్రియాంక చోప్రా బాలీవుడ్ టు హాలీవుడ్ ట్రావెల్ చాలామందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇండియన్ హీరోయిన్లు కూడా హాలీవుడ్ వాళ్లకు తక్కువేమీ కాదు అని ప్రూవ్ చేసింది ప్రియాంక. ఇప్పటికే క్వాంటికో టీవీ సీరీస్ తో అభిమానులను సంపాదించుకున్న పిగ్గీ, ఇప్పుడు ఒక సినిమాలో విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. విచిత్రమేంటంటే, ఈ స్క్రిప్ట్ మొదలెట్టినప్పుడు, మగ విలన్ ను రాసుకున్నారట. అయితే ప్రియాంక పెర్ఫామెన్స్ చూసిన తర్వాత, ఆమె అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని మూవీ టీం భావించారట. ఈ రెండూ పక్కన పెడితే, ఇప్పుడు మరో అవకాశం ప్రియాంక తలుపు తట్టిందంటున్నారు బాలీవుడ్ జనాలు. హాలీవుడ్ లో చాలా ప్రేస్టేజియస్ గా తెరకెక్కే జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని ప్రియాంకను అడిగితే, నాకు బాండ్ గర్ల్ గా కంటే, బాండ్ గా నటించడమే ఇష్టం అంటూ సమాధానం ఇస్తోంది. ఇప్పటికే క్వాంటికో లో అమెరికన్ పోలీస్ గా ఇరగదీసిన ప్రియాంక, గంగాజల్ లో కూడా పవర్ ఫుల్ పోలీస్ గా తన సత్తా చూపించింది. అందుకే లేడీ బాండ్ గా సినిమా తీస్తే తాను నటిస్తానంటూ చెబుతోంది. అంతే కాదండోయ్. విశ్వనటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమంటోంది. ఇంతకీ బాండ్ సినిమాలో ఆమె ఉన్నట్టా..లేనట్టా..?