అమ్మా... ప్రియాంకా... ఏంటమ్మా ఈ దారుణం?
on Jul 25, 2017
టాలీవుడ్ భామలందరూ బాలీవుడ్ వైపు చూస్తుంటే... బాలీవుడ్ భామలంతా హాలీవుడ్ వైపు చూస్తున్నారు. ప్రియాంకా చోప్రా ఈ విషయంలో అందరికంటే ముందుంది. ‘క్వాంటికో’ టీవీ సిరీస్ తో అమెరిన్ ఎంటర్ టైన్ మెంట్లోకి అడుగుపెట్టిన ప్రియాంక... అక్కడి ప్రేక్షకులను బాగానే బుట్టలో వేసుకుంది. హాలీవుడ్ హీరో డ్వేన్ జాన్సన్ తో కలిసి ప్రియాంక చేసిన ‘బేవాచ్’ చిత్రం కూడా మంచి పేరు తేవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు పోటెత్తాయి. ప్రస్తుతం హిందీ సినిమాల కంటే ఇంగ్లిష్ సినిమాలే ఎక్కువ చేస్తోంది ప్రియాంక. ఏ కిడ్ లైక్ జేక్, ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్... ప్రస్తుతం ఆమె చేస్తున్న హాలీవుడ్ సినిమాలు. ఇదిలావుంటే... ఇటీవలే డైలీ మెయిల్ ద్వారా ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ చిత్రం షూటింగ్ స్టిల్స్, వీడియోస్ లీక్ అయ్యాయి. అవి చూసిన కుర్రకారుకు టెంపరేజర్ పెరిగిపోతోందని టాక్. ఇప్పటివరకూ భారతీయ సినిమాల్లో కూడా కనపించనంత బోల్డ్ గా ప్రియాంక ఇందులో కనిపిస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. హాలీవుడ్ నటుడు అడమ్ డివైన్ తో హద్దులు మీరి.. ప్రియాంక చేసిన విన్యాసాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
చూసిన వారందరూ ఇది అడల్డ్ సినిమానా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రియాంక స్పందన కూడా వీరి అనుమానాలకి మరింత బలాన్నిచ్చింది. ‘ఇదొక రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ సినిమాలో కుక్క కూడా ఎంతో రొమాంటిక్ గా బిహేవ్ చేస్తుంది’ అని ట్వీట్ చేసేసింది ప్రియాంక. బాలీవుడ్ తెరపై వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమాలే చూడ్డానికి దారుణంగా ఉంటాయి. మరి హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ అంటే... ఇక చెప్పేదేముంది?