హీరోయిన్లు ముందు... పవన్ కల్యాణ్ తరవాత!
on Sep 21, 2020
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'వకీల్ సాబ్' షూటింగ్ సోమవారం నుండి హైదరాబాద్లో స్టార్ట్ అవుతోంది. ఆల్మోస్ట్ ఆరు నెలల తరవాత ఈ సినిమా మళ్ళీ సెట్స్ మీదకు వెళ్ళింది. సజావుగా సాగుతున్న 'వకీల్ సాబ్' షూటింగును లాక్డౌన్ వల్ల ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగులు మొదలవుతున్నాయి. దాంతో నిర్మాత దిల్ రాజు కూడా 'వకీల్ సాబ్' షూటింగ్ స్టార్ట్ చేశారు.
ఈ రోజు 'వకీల్ సాబ్' షూటింగ్ మొదలైంది. కానీ, లీడ్ కాస్ట్ ఎవరు జాయిన్ అవ్వడం లేదు. ఈ షెడ్యూల్ 20 రోజులు ఉంటుందట. ఈ వారంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ జాయిన్ అవుతారట. పవన్ కల్యాణ్ చాతుర్మాస్య దీక్ష పూర్తయిన తరవాత జాయిన్ అవుతారట. మరో 30 రోజులు పాటు షూటింగ్ చేస్తే కంప్లీట్ అవుతుందట. కోర్టు రూమ్ సన్నివేశాలు షూటింగ్ చేయాలట.