మరో ఇంట్రస్టింగ్ మల్టీస్టారర్లో రానా!!
on Jul 2, 2019
విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ వివిధ భాషల్లో రాణిస్తోన్న నటుడు రానా. ప్రజంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడీ హీరో. ఒక వైపు సోలో హీరోగా మూవీస్ చేస్తూనే మరో వైపు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ చిత్రాలతో నటిస్తోన్న రానా మరో మల్టీస్టారర్ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తో గతంలో కబాలి, కాలా చిత్రాలు డైరక్ట్ చేసిన పా.రంజిత్ ఫ్రీ డమ్ ఫైటర్ బిర్సా ముండా లైఫ్ హిస్టరీ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ మల్టీస్టారర్ రానా ని ఓ ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించినట్లు, ఆయన ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.