English | Telugu

ట్రైలర్ రివ్యూ: ఆక్సిజన్

on Sep 30, 2017

గోపిచంద్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆక్సిజన్ ఏనాడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది..చాలా రోజులుగా సినిమాను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తూ వచ్చారు. అయితే వరుసగా పెద్ద సినిమాలు ఉండటంతో పాటు సాంకేతిక కారణాలతో ఆక్సిజన్ విడుదలకు నోచుకోవడం లేదు. అయితే విజయదశమి కానుకగా అభిమానుల కోసం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. గోపిచంద్ తన కుటుంబం గురించి..జరిగిన విషాదం గురించి చెబుతూ ఉండగా ట్రైలర్ సాగుతుంది. సంతోషాన్ని పంచే అమ్మానాన్న, నవ్వుతూ పలకరించే ప్రియురాలు..పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే స్నేహితులు..లైఫ్ అంటే నాదే అనుకున్నాను..ఒక్కరోజు అంతా చీకటైపోయింది..నాకు జరిగింది..మీకూ జరగవచ్చు..కానీ అలా జరగనివ్వను అంటూ గోపిచంద్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.. యాక్షన్ సీన్లు బాగున్నాయి..శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపిచంద్‌కు జంటగా రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here