ఓ బేబీ....వెంకీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా ?
on Jun 28, 2019
ఈ మధ్యనే మజిలీతో మరపురాని హిట్ అందుకున్న సమంత లీడ్ రోల్ లో చేస్తున్న తాజా సినిమా ఓ బేబీ. అలా మొదలయింది ఫేం నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చే నెల 5వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని 'జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్' లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. . ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అన్నది ఈరోజు ఉదయం వరకూ సస్పెన్స్ గానే ఉంచారు. సురేష్ ప్రొడక్షన్స్ లో వస్తున్న సినిమా కాబట్టి వారి తాలూకా వారే వస్తారని అనుకున్నారు.
అనుకున్నట్టే ఆ చీఫ్ గెస్ట్ లు ఎవరు అనేది కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆ చీఫ్ గెస్ట్ లు ఎవరయ్యా అంటే సురేష్ బాబు తమ్ముడు విక్టరీ వెంకటేష్, కుమారుడు రానా. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకుంతోంది. 70 సంవత్సరాల బామ్మ 20 ఏళ్ల భామగా మారిపోతే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ మీద తెరకెక్కిన ఈ సినిమా ఓ గ్రానీ అనే కొరియన్ సినిమాకి రీమేక్. అయితే ఈ మధ్య కాలంలో వెంకటేష్ ఏ సినిమా రిలీజ్ ఫంక్షన్ కి వెళ్తే ఆ సినిమా హిట్ అవుతోంది. మరి ఆ సెంటిమెంట్ ఈ సినిమాకి పని చేస్తుందో లేదో చూడాలి మరి. అన్నట్టు సమంతాకి వెంకటేష్ బాబాయ్, రానా అన్నయ్య అవుతారన్న సంగతి తెలిసిందే.