నాని నిర్మాతలు అఫీషియల్‌గా తప్పుడు స్టేట్మెంట్
on Apr 22, 2017
అనుకున్న సమయం కన్నా ముందుగానే అంటే జూన్ 23న వస్తున్నాం అని నాని నిన్ను కోరి నిర్మాతలు నిన్న అఫీషియల్ గా ట్విట్టర్ సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చారు. జులై కి అనుకున్నా, అన్ని పనులు ముందుగానే ముగుస్తుండడంతో జూన్ లోనే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. కానీ, అదే రోజు అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం రిలీజ్ అవనుంది. అందుకని, మళ్ళీ ముందు అనుకున్న డేట్ అంటే జులై 7 కి ఫిక్స్ చేశారని తెలిసింది. మరి అలాంటప్పుడు, జూన్ 23 న విడుదల చేస్తున్నాం అనే స్టేట్మెంట్ ఎందుకిచ్చారో అర్ధం కాదు. నాని మంచి హీరోగా ఎదుగుతున్నా కూడా, తన రేంజ్ ఏంటో తెలిసిన వాడు కాబట్టే, ఎప్పుడూ అగ్ర హీరోలతో పోటీ పడ లేదు.
ఈ సారి కూడా అంతటి ధైర్యం చేయడం లేదు. అయితే, వాస్తవానికి, నాని నిర్మాతలు తప్పుడు స్టేట్మెంట్ ఏం ఇవ్వ లేదు, కానీ అది అనుకోకుండా జరిగిన చర్య. అల్లు అర్జున్ డీజే జులై లో వస్తుందేమో అనుకోని తమ సినిమా జూన్ లో విడుదల చేస్తాం అని చెప్పారు. మళ్ళీ డీజే జూన్ లో వస్తుందని తెలియగానే తమ నిర్ణయం మార్చుకున్నారు. నిన్ను కోరి మంచి బిజినెస్ చేయడంతో ట్రేడ్ వర్గాల్లో సినిమా మీద పాజిటివ్ బజ్ ఉంది. ఆది కూడా ఉండడం సినిమాకి అతి పెద్ద అసెట్.
Also Read