నాగ్, వర్మ సినిమా కథ ఇదే?
on Nov 21, 2017
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ దాదాపు పాతికేళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్నారు. ‘గోవిందా గోవిందా’తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలిసి పనిచేయడం విశేషమే. అయితే.. ‘నాకు మైండ్ దొబ్బిన మాట నిజం’ అని ఒప్పుకున్న వర్మ.. కథను ఎలా తయారు చేశాడా? అనేది ఇక్కడ ప్రశ్న. మైండ్ దొబ్బితే.. కథలెలా పుడతాయ్? ఒకవేళ పుడితే ఎలాంటి కథలు పుడతాయ్? అనేది ఇప్పుడు చర్చ. నాగ్, వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం... ఓ హాలీవుడ్ సినిమాకు రీమేక్ అని తెలుస్తుంది. మైండ్ దొ్బ్బడం వల్ల.. కథలు తయారు చేసుకునే శక్తి లేక హాలీవుడ్ కథను వర్మ ఆశ్రయించాడా? ఇప్పుడు ఫిలింనగర్లో ఇదే డిస్కషన్. హాలీవుడ్లో 2008లో విడుదలై.. సంచలన విజయం సాధించిన ‘టేకెన్’... ఈ సినిమాకు మాతృక అని తెలుస్తోంది.
ఇక ‘టేకెన్’ కథ విషయానికొస్తే.. స్పర్ధలు రావడంతో భార్యాభర్తలైన హీరోహీరోయిన్లు విడిపోతారు. విడిపోయేనాటికి హీరోయిన్ ప్రెగ్నెంట్. అయినా ఆమె మరొకర్ని పెళ్లి చేసుకుంటుంది. తను పెళ్లి చేసుకున్న తర్వాతే ఓ ఆడపిల్లక జన్మనిస్తుంది. హీరో మాత్రం పెళ్లి చేసుకోడు. అలాగే ఒంటరిగా మిగిలిపోతాడు. హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న వ్యక్తి.. ఆమెకు పుట్టిన అమ్మాయిని కూడా సొంత కూతురిలా చూసుకుంటుంటాడు. కాలం గడుస్తుంది. పాపకు పదేళ్లు వస్తాయ్. హీరో తన ఆర్మీ ఉద్యోగానికి రిటైర్మెంట్ తీసుకొని ఒంటరిగా ఉంటుంటారు. అయితే... ఒకరోజు ఆనుకోని సంఘటన జరుగుతుంది. స్కూల్ కి వెళ్లిన పాప తిరిగి రాదు. హీరోయిన్ వెతకని చోటు ఉండదు. ఆమె భర్త కూడా పాపకోసం ఎంతో వెతుకుతాడు. కానీ... పాప జాడ తెలీదు. హీరోయిన్ గుండెలవిసేలా ఏడుస్తుంది.
ఇక చేసేది లేక ఆ అమ్మాయి తండ్రి దగ్గరకు వెళుతుంది. అదే... హీరో దగ్గరకు వెళ్తుంది. ‘నీ కూతురు కనిపించడం లేదు’ అనే విషయం చెబుతుంది. భార్య, బిడ్డ ఎక్కడున్నా.. సుఖంగానే ఉంటారులే అని భావిస్తున్న హీరోకి ఈ వార్త పెద్ద షాక్ కే గురి చేస్తుంది. ఇక అక్కడ్నుంచి కూతుర్ని వెతికే పనిలో దిగుతాడు హీరో. ఈ ప్రయాణంలో హీరోకి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయ్. పాప.. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయిందని గ్రహిస్తాడు. ఇక అక్కడ్నుంచి ప్రాణాలకు తెగించి తన బిడ్డను కాపాడుకుంటాడు. ఇది ‘టేకెన్’ కథ. నాగ్ తో వర్మ చే్స్తున్న కథ ఇదే అని విశ్వసనీయ సమాచారం. ఇదే కథతో సినిమా చేస్తే నిజంగా హిట్ గ్యారెంటీ. అయితే... ‘మైండ్ దొబ్బింది’ అని బాహాటంగానే చెబుతున్న వర్మ.. ఈ కథను సరిగ్గా తీస్తాడా? అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.