ఎన్టీఆర్ బయోపిక్ లో నాగ చైతన్య..?
on Jun 23, 2018
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మహానటి సావిత్రి బయోపిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మహానటిలో సావిత్రిలా కీర్తి సురేష్ ఎంత బాగా ఒదిగిపోయిందో, ఎన్టీఆర్ లా బాలకృష్ణ అంత బాగా ఒదిగిపోతాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో కొన్ని ముఖ్యపాత్రలు ఉన్నాయి.. వాటిల్లో ఎవరు నటిస్తారా? అని కూడా ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడొక ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది.. అదేంటంటే ఎన్టీఆర్ బయోపిక్ లో 'ఏఎన్ఆర్' పాత్రకోసం నాగ చైతన్యని సంప్రదించారట.. అయితే నాగ చైతన్య ఇంకా క్లారిటీ ఇవ్వలేదట.. ఇప్పటికే మహానటిలో తాత పాత్రలో కనిపించి అలరించిన నాగ చైతన్య, మరొక్కసారి తాత పాత్రలో కనిపించడానికి అంగీరిస్తాడా?.. చూద్దాం ఏం చేస్తాడో.. మరోవైపు బాలకృష్ణ ఎన్టీఆర్ గా చేస్తున్నాడు కాబట్టి, ఏఎన్ఆర్ పాత్రలో నాగార్జునని తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. చూద్దాం మరి ఏఎన్ఆర్ పాత్రలో కొడుకు నటిస్తాడో? లేక మనవడు నటిస్తాడో?.