అక్కినేని తలపిస్తోన్నమనవడి లుక్!!!
on Sep 20, 2018
అవును ఈ రోజు విడుదల చేసిన ఎన్టీర్ చిత్రంలోని ఏయన్నార్ లుక్ అదిరిరందంటున్నారు. ఈ లుక్ లో అచ్చం అక్కినేని లాగే కనిపిస్తున్నాడు సుమంత్. ఈ రోజు అక్కినేని జయంతి సందర్భంగా ఈలుక్ విడుదల చేశారు. విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ లైఫ్ హిస్టరీ ఆధారంగా వస్తోన్న చిత్రం `ఎన్టీఆర్`. ఈ బయోపిక్ లో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ఏయన్నార్ సమకాలీకులు కావడంతో ఎన్టీఆర్ బయోపిక్ లో ఏయన్నార్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పాత్రకోసం ఏయన్నార్ మనవడు సుమంత్ ని తీసుకున్నారు.
ఇక ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ చిత్రంలోని బాలయ్య లుక్ అచ్చం అన్నగారిలాగే ఉందంటూ మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కూడా సరిగ్గా సరిపోయాడంటూ తెగ పొగిడేసారు. ఇక ఏయన్నార్ పాత్రలో సుమంత్ అయితే టీనేజ్ లో ఏయన్నార్ ని చూస్తున్నట్లే అనిపిస్తోంది. లుక్ పరంగా ఓకే కానీ నటన పరంగా ఎలా ఉంటుందో అని కొంత మంది సందేహం వ్యక్తపరిచినా.... అక్కినేని అభిమానులు మాత్రం కచ్చితంగా తాత ఎక్కడున్న గర్వించేలా సుమంత్ నటిస్తాడంటున్నారు. ఇప్పటికే విడదులైన ఒక్కో లుక్ ని అదరగొడుతూ దర్శకుడు క్రిష్ నందమూరి అభిమానులను అలరిస్తూ ఎన్టీఆర్ సినిమా పై అంచనాలు పెంచుతున్నాడు. జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది.