`మహర్షి` ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు!!
on May 10, 2019
దిల్ రాజు, అశ్వినిదత్, పీవీపీ సంయుక్తంగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం `మహర్షి`. శ్రీమంతుడు, భరత్ అనేనేను సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మహేష్ నటించిన 25వ సినిమా కావడంతో భారీ అంచనాలతో సినిమా ఈ గురువారం విడుదలైంది. రిషి పాత్రలో లీనమై నటించాడు అంటూ మహేష్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక హీరో ఫ్రెండ్ గా ఎమోషనల్ పాత్రలో నటించిన అల్లరి నరేష్ కి కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. పూజా హెగ్డే అందం, అభినయం సినిమాకు ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే...మొదటి రోజు దాదాపు 45 కోట్లు రాబట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ ఉమర్ సందు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. అలాగే చెన్నైలో 23 లక్షలు, కాకినాడలో 50 లక్షలు, గుంటూరులో నాలుగున్నర కోట్లు వసూళ్లు రాబట్టినట్లు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 29 లక్షలు కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం.