ట్రైలర్ రివ్యూ: ఎంసీఏ
on Dec 12, 2017
వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న నాని.. ఫిదా లాంటి క్లాస్ హిట్ అందుకున్న సాయిపల్లవి జంటగా వేణుశ్రీరాం దర్శకత్వంలో నటిస్తోన్న మూవీ ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయ్). టీజర్, నాని లుక్స్, లిరికల్ వీడియోలతో ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేసిన దిల్‌రాజు.. తాజాగా ఎంసీఏ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. "వదినకి వరంగల్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది రా.. నువ్వు వెళ్లాలి అంటూ" రాజీవ్ కనకాల వాయిస్‌తో ట్రైలర్ స్టార్టవుతుంది.
దీన్ని బట్టి చూస్తుంటే ఇది వదిన-మరిదిల కథ అని రాజుగారు హింట్ ఇచ్చేసినట్లు అర్థమవుతోంది. ఇంట్లో వదినదే పెత్తనమని.. ఆ ఫస్ట్రేషన్‌ను ఎలా తీర్చుకోవాలో తెలియక పిన్నితో తన బాధను చెప్పుకుంటాడు హీరో. ఈ నేపథ్యంలో వదినకి ఓ సమస్య వస్తుందని.. దానిని హీరో ఎలా తీర్చుకుంటాడన్నదే ఎంసీఏ కథగా తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.. సీనియర్ హీరోయిన్ భూమిక ఈ మూవీలో నానికి వదినగా నటిస్తోంది. ఈ నెల 16న ఎంసీఏ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తుండగా.. 21న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు దిల్‌రాజు.