సలార్ కి కేజీఎఫ్ స్ట్రాటజీ..
on Jan 23, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా సలార్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ సాగా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హొంబళే ఫిల్మ్స్.. సలార్ ని నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. సలార్ లో ప్రభాస్ సరసన నటించే నాయిక విషయంలో ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామల పేర్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కియారా అద్వాని, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్, దిశా పటాని.. ఇలా కొందరి పేర్లు వార్తల్లో నిలిచాయి. అయితే, ప్రశాంత్ నీల్ వీళ్ళెవర్నీ సంప్రదించలేదట. ఇందులో ప్రభాస్ కి జోడీగా ఓ కొత్తమ్మాయిని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఫ్రెష్ అండ్ హాట్ లుక్స్ ఉన్న మోడల్ ని హీరోయిన్ రోల్ కోసం అన్వేషిస్తున్నారట ప్రశాంత్. తన గత చిత్రం కేజీఎఫ్ లో ఎలాగైతే మోడల్ శ్రీనిధి శెట్టి కి తొలి అవకాశమిచ్చారో.. అదే స్ట్రాటజీని సలార్ విషయంలోనూ ఫాలో అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారట.
మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.