చిరు కొత్త సినిమా అప్ డేట్!!
on Sep 15, 2018
ప్రిన్స్ మహేష్ బాబుతో `భరత్ అనే నేను` లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళతుందనే విషయంలో ఇప్పటి వరకూ క్లారటీ రాలేదు. తాజా వార్తల ప్రకారం జనవరి నెలాఖరేకల్లా `సైరా నరసింహారెడ్డి` చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని భావిస్తున్నారట చిరంజీవి. ఆ తర్వాత ఫిబ్రవరి నెలంతా బ్రేక్ తీసుకుని మార్చిలో కొరటాల శివ సినిమాతో బిజీ అవ్వాలని ఫిక్స్ అయ్యారట. కొరటాలకు కూడా ఈ అప్ డేట్ ఇవ్వడంతో, ఫుల్ స్వింగ్ లో ఈ సినిమాకి సంబంధించి వర్క్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాకి స్టోరీ లైన్ విషయంలో వెళితే ఈ సినిమాలో చిరంజీవి డ్యుయెల్ రోల్స్ లో కనువిందు చేయబోతున్నారని సమాచారము. రైతన్న గా ఓ పాత్ర, యన్.ఆర్.ఐ గా మరో పాత్ర ఉంటుందట. సోషల్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందట. మొత్తం మీద తనదైన శైలిలో మంచి మేజేజ్ తో మెగాస్టార్ చిరంజీవితో ఓ కమర్షియల్ సినిమా తెరకెక్కించడానికి కొరటాల సమాయత్తమవుతున్నాడని చెప్పొచ్చు.