కీర్తి సురేష్ కూడా మొదలెట్టింది!!
on Dec 8, 2018
కొన్ని సినిమాలే చేసినా కానీ, పేరుకి తగ్గట్టుగా ఎనలేని కీర్తిని సంపాదించుకుంది కీర్తి సురేష్. ఒక వైపు మహానటి లాంటి సినిమాలు చేస్తూనే...మరోవైపు గ్లామర్ పాత్రలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోందీ బొద్దుగుమ్మ. అయితే తాజా కీర్తి సురేష్ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేమిటంటే...నాలుగు పాటలు, రొమాంటిక్ సీన్స్ వరకే పరిమితం కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయడానికి రెడీ అవుతోందట. తాజాగా కీర్తి సురేష్ ఈస్ట్ కోస్ట్ బేనర్ లో మహేష్ కోనేరు నిర్మాతగా ఓ సినిమా చేయడానికి ఒప్పుకుందట. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందే ఈ సినిమా డైరక్టర్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కంటెంట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కీర్తి సురేష్. అలాగే ఈ అమ్మడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే జక్కన్న సినిమాకు బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే కీర్తి సురేష్ స్పందించేదాకా ఆగాల్సిందే మరి.