కౌశల్ పై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు
on Sep 24, 2018
కాంట్రవర్సీకి కేరాఫ్ కత్తి మహేష్ మరొక్కసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఆయన బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ కౌశల్ ని టార్గెట్ చేసారు. బిగ్ బాస్ 2 చివరి దశకు చేరుకుంది. ఫైనల్లో కౌశల్, దీప్తి, తనీష్, సామ్రాట్, గీతా మాధురి ఉన్నారు. ఈ ఐదుగురిలో కౌశల్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతే కాదు కొందరు కౌశల్ పేరిట 'కౌశల్ ఆర్మీ' ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ అనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. అయితే కత్తి మహేష్ మాత్రం బిగ్ బాస్ లో కౌశల్ చిరాకు తెప్పించే వ్యక్తి, అతను టైటిల్ గెలవకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
హౌస్‌లో ఇటీవల గొడవ జరిగిన నేపథ్యంలో ‘కౌశల్ అంతా కోల్పోయాడు.. అతన్ని హౌస్ నుంచి బయటకు గెంటేయండి’ అని ట్వీట్ పెట్టారు కత్తి మహేష్. శనివారం నాని కౌశల్‌ని ప్రశ్నించిన నేపథ్యంలో ‘చాలా పేలవమైన, విసుగుపుట్టించే సమాధానం చెప్పాడు కౌశల్.. బిగ్‌బాస్ చరిత్రలోనే చాలా చిరాకు తెప్పించే వ్యక్తి’ అని ట్వీట్ చేసారు. తాజాగా మరో అడుగు ముందుకేసి సంచలన ట్వీట్ చేసారు. ‘కౌశల్ బిగ్‌బాస్ 2లోనే చాలా విసుగు తెప్పించే వ్యక్తి. ఒకవేళ అతను బిగ్‌బాస్ 2 గెలిస్తే మనమెంత ఇడియట్స్ అనేది ప్రూవ్ అవుతుంది’ అని పేర్కొన్నారు. మరోవైపు తాను దీప్తి నల్లమోతు తరుఫున క్యాంపెయిన్ నిర్వహిస్తానని ఫేస్బుక్ ద్వారా కత్తి మహేష్ తెలిపారు.
Also Read