English | Telugu

లీకైన మెయిల్స్.. బజారున పడ్డ బతుకులు

on Oct 5, 2017

తగాదా అయితే.. ఒకరికొకరు మాటలనుకోవడం కామన్. అలా చేస్తే... గొడవ అక్కడితో సద్దుమణిగిపోతుంది. అదేంటో కానీ.. సోషల్ మీడియా వచ్చాక... ముఖ్యంగా ఈ సెలబ్రిటీలు.. వాళ్ల గొడవల్లో జనాలను కూడా భాగస్తుల్ని చేస్తున్నారు. జనాలకు తెలిసేలా సోషల్ మీడియాలో ఇష్టంలేని వాళ్లపై కామెట్లు పెట్టే పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారు. ఓ విధంగా ఒకళ్ల బతుకుల్ని ఒకళ్లు బయటేసుకునే పనిలో పడ్డారు. ఈ విషయంలో అందరికంటే ముందుంది బాలీవుడ్. అక్కడ కూడా అందరిలో ముందు చెప్పుకోవాల్సిన పేర్లు కంగనా రనౌత్, హృతిక్ రోషన్. 

ఒకప్పుడు ఇద్దరూ కలిసి తిరిగారు. ఇప్పుడు బద్ధ శత్రువులు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరూ చేస్తున్న రచ్చఅంతాఇంతా కాదు. మొన్నటిదాకా తమ ఆంతరంగిక అంశాలను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ... హృతిక్ ని సాధ్యమైనంతవరకూ బదనాం చేసింది కంగనా. దానిపై హృతిక్ కూడా ఘాటుగానే స్పందించాడు. అయితే... ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది అనుకుంటే... ఇప్పుడు తాజాగా కంగనా ఈ మెయిల్స్ కొన్ని సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయ్. ఈ మెయిల్స్ లో రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ ల ప్రస్తావన ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ మెయిల్స్ ని హృతిక్ రోషనే లీక్ చేసినట్లు అనుమానాలున్నాయ్. ఎందుకంటే... ఆ అవసరం మరొకరికి లేదు. 

రణబీర్.. తనను అంతకు ముందు పెద్దగా పట్టించుకునేవాడు కాదనీ... ‘క్వీన్’ తర్వాత తనపై ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు.. లీకైన మెయిల్స్ లో ఉండటం గమనార్హం. అలాగే... తాను ‘రివాల్వర్’ షూటింగ్ నిమిత్తం గ్వాలియర్ లో ఉన్నప్పుడు రణబీర్ నేరుగా కంగనాను కలిశాడట. తనతో రిలేషన్ షిప్ గురించి ప్రస్తావిస్తే... తాను మరొకరితో కలిసి ఉంటున్నట్లు కంగనా చెప్పిందట. ఈ విషయం కూడా లీకైన మెయిల్స్ లో ఉంది. 

తాను న్యూయార్క్ లో ఉన్నప్పుడు రణబీర్ నుంచి ఫోన్ వచ్చిందట. ‘న్యూయార్క్ ఎలా ఉంది?’ అని అడిగాడట. అప్పుడు కంగనా... ‘ఏంటి? నాతో ఫిజికల్ రిలేషన్ షిప్ కోరుకుంటున్నావా?’ అని అడిగేసిందట. దాంతో రణబీర్ ఖంగు తిన్నాడట. మనం ఎప్పటిలాగే కలిసుందామనీ... తాను ఇప్పటికే మరొకరితో రిలేషన్లో ఉన్నాననీ.. ఆశలు పెట్టుకోవద్దనీ కంగనా చెప్పడంతో రణబీర్ నిరాశ చెందాదట. ఈ విషయం కూడా లీకైన ఈ మెయిల్స్ లో ఉండటం విశేషం. 

ఏది ఏమైనా ఈ మెయిల్స్ ని లీక్ చేసింది మాత్రం హృతిక్ రోషనే అనే వాదన బయట బలంగానే వినిపిస్తుంది. సమసిపోయింది అనుకున్న గొడవ.. ఈ మెయిల్స్ లీకేజీతో మళ్లీ రగులుకుంది. మరి దీనిపై కంగనా ఎలా స్పందిస్తుందో...ఈ గొడవ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here