English | Telugu

ఇంట్లో వాడే కంట్లో పుల్ల అయ్యాడు!

on Oct 9, 2017

 

‘ఇంట్లో వాళ్లే కంట్లో పుల్ల అవ్వడం’ అంటే ఏంటో తెలుసా? ఒకసారి తమిళనాడు వైపు లుక్కేయండి. ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తారు. వారి వ్యవహారం చూస్తే... అదేంటో అర్థమవుతుంది. వారిద్దరూ ఎవరో కాదండోయ్. మన జాతీయనటుడు కమల్ హాసన్. ఆయన అగ్రజుడు చారుహాసన్.

ఓ వైపు తమ్ముడు కమల్ పార్టీని స్థాపించి, రాబోతున్న ఎన్నికల సమరంలో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అవుతుంటే... తోడబుట్టిన అన్నే.. మీడియా ఇంటర్వ్యూలో కమల్ కి అంత సీన్ లేదు అని తేల్చిపారేశాడు. ‘అసలు కమల్ హాసన్ పార్టీ పెడితే... ఇప్పుడున్న పరిస్థితుల్లో నెగ్గలేడు. తనకు అంత స్థాయి లేదు. ఇక రజనీకాంత్ విషయానికొస్తే... అతను అసలు రాజకీయాలకే పనికిరాడు. ఇదంతా పైపై ఆర్భాటం తప్ప.. జరిగే పనులు కావ్’ అని నిర్మొహమాటంగా చెప్పేశాడు చారు హాసన్.

మరి తమిళనాట ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికుంది? అనడిగితే..  కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే యూత్ వింగ్ ప్రెసిడెంట్ అన్బుమణి రాందాస్ పేరు చెప్పారు. చారుహాసన్ కి వయసెక్కువై... చాదస్తం, పైత్యం పెరిగి అన్బుమణి పేరు చెప్పాడా? అనేది పలువురి అప్రాయం. లేకపోతే... సోదిలో కూడా లేనాయన పేరును ఏకంగా ముఖ్యమంత్రి రేసులోకి నిలబెట్టడం ఏంటి? విడ్డూరం కాకపోతే.

ఏది ఏమైనా.. సొంత అన్నయ్యే కమల్ విషయంలో ఇలా మాట్లాడటం మాత్రం నిజంగా బాధాకరమైన విషయమే. అప్పుడే ప్రత్యర్థులు ఈ వ్యవహారంపై వెటకారపు జోకులేసేస్తున్నారు. ‘సొంత అన్నకే విశ్వాసం కలిగించలేని వ్యక్తీ... కోట్లాది ప్రజల్ని ఏం నమ్మిస్తాడట’ అని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదిలావుంటే... వచ్చే నెల 7న కమల్ పార్టీని ప్రకటించనున్నాడు. ఆ పార్టీ పేరేంటి? దాని విధివిధానాలేంటి? కార్యాచరణ ప్రణాళికలేంటి? ఇవన్నీ తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here