ఎన్టీఆర్ 'అరవింద సమేత'లో కాజల్
on Jun 16, 2018
కాజల్.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చందమామ ప్రేక్షకుల మనస్సు గెలుచుకొని స్టార్ హీరోయిన్ అయింది.. కాజల్ చాలా మంది హీరోలతో నటించింది, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాజల్ మీద ప్రత్యేక అభిమానం చూపిస్తారు..దానికి కారణం, కాజల్ ఎన్టీఆర్ లక్కీ హీరోయిన్ కావడమే.. ఎన్టీఆర్, కాజల్ కలయికలో వచ్చిన బృందావనం, బాద్షా, టెంపర్ అన్నీ సినిమాలు హిట్.. అలానే కాజల్ ఐటమ్ సాంగ్ చేసిన జనతాగ్యారేజ్ కూడా హిట్.. ఇలా కాజల్ కనిపించిన ఎన్టీఆర్ అన్నీ సినిమాలు హిట్.. ఇప్పుడిదే సెంటిమెంట్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అరవింద సమేత సినిమాకి కూడా కలిసిరానుంది.. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందట.. దీనికోసం కాజల్ ని తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.. ఈ వార్త నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే.
Also Read