కేజీఎఫ్ ఛాప్టర్ 2: కొత్త రిలీజ్ డేట్
on Jan 22, 2021
కేజీఎఫ్ ఛాప్టర్ 1 సెన్సేషనల్ హిట్ కావడంతో.. సహజంగానే అందరి కళ్ళు కేజీఎఫ్ ఛాప్టర్ 2పైనే ఉన్నాయి. రాఖీ బాయ్ యశ్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్.. యూట్యూబ్ ముంగిట సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీంతో.. స్కై హై ఎక్స్ పెక్టేషన్స్ ఈ సినిమా చుట్టూ ఉన్నాయి. దానికి తోడు ఛాప్టర్ 2లో ప్రముఖ బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ తో పాటు ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి హేమాహేమీలు నటించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉంటే.. రీసెంట్ గా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా, డిస్ట్రిబ్యూటర్స్ అందించిన సమాచారం ప్రకారం కేజీఎఫ్ ఛాప్టర్ 2ని మే 30న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే నయా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరి.. ఈ పాన్ ఇండియా మూవీతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.