మెగా హీరోతో జెర్సీ డైరెక్టర్!!
on Apr 24, 2019
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా `జెర్సీ` సినిమాకు సంబంధించిన వార్తలే వినబడుతున్నాయి. ముఖ్యంగా నాని నటన, డైరక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రతిభ గురించి మాట్లాడుతున్నారు. రెండో సినిమానే ఇంత బాగా డీల్ చేసాడంటూ విమర్శకులు, ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలంతా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో దర్వకుడు గౌతమ్ కు భారీ ఆఫర్స్ వస్తున్నాయి.
అయితే మెగా హీరోతో సినిమా చేస్తున్నట్లు ప్రజంట్ సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఎక్స్ పర్మెంటల్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్న వరుణ్ తేజ్ , గౌతమ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తి చేసే లోపు గౌతమ్ ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి.. ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారట.