జై లవ కుశ దొంగ దొరికాడు... అరెస్ట్ చేసిన పోలీసులు...
on Jun 28, 2017
తెలుగు అనే కాదు అన్ని ఇండస్ట్రీ లని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. ఇండస్ట్రీ పెద్దలు సైబర్ క్రైమ్ అధికారులు ఎంత జాగర్తగా ఉన్న, పైరసీ గాళ్ళు అంతే తెలివిగా సినిమానో లేదా సినిమాలో ఏదో కంటెంట్ నో లీక్ చేసే పనిలో తమ ప్రావీణ్యం చాటుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, ఎన్టీఆర్ జై లవ కుశ టీజర్ గా చెప్పబడుతున్న వీడియో ఒకటి నిన్న సోషల్ మీడియా లో వైరల్ అయింది. కొందరు ఫాన్స్ కి ముందే చూసిన ఆనందం ఉంటే, ఇంకొందరికి ఈ లీకేజ్ గుబులు పుట్టించింది. అయితే, ఈ లీకేజ్ వెనుక ఉన్న గణేష్ అనే వ్యక్తిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయాన్నీ అధికారికంగా ధృవీకరించిన జై లవ కుశ దర్శక నిర్మాతలు లీక్ అయిన విజువల్స్ టీజర్ లోనివి కాదని. అవి ఇంకా అప్రూవ్ అవని రఫ్ కట్ అని తేల్చేసారు. ఇదిలా ఉంటే, ఈ లీక్డ్ టీజర్ చుసిన ఫ్యాన్స్ మాత్రం తమ సంతృప్తి వెలిబుచ్చుతున్నారు. విజువల్స్ ఒక ఎత్తయితే, దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం మరో ఎత్తు అని అభిప్రాయం పడుతున్నారు. జులై మొదటి వారంలో విడుదలవనున్న అఫీషియల్ టీజర్ అంతకు మించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.