ప్రభాస్ ని 'బ్యాడ్ బాయ్' అన్న భామ 'టిక్ టాక్'లో నెంబర్ వన్
on Dec 20, 2019
అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మొత్తం మన చుట్టూనే తిరుగుతున్నట్లు ఉంటుంది. అంతేకాక రోజుకో ట్రెండ్ కూడా మారుతుంది. ప్రస్తుతం మనం డబ్ స్మాష్ నుంచి టిక్ టాక్ ప్రపంచంలోకి వచ్చాం. సెలబ్రిటీల నుంచి సాదాసీదా మనుషుల వరకూ అంతా టిక్ టాక్ చేసి వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. వీడియో షేరింగ్ యాప్ అయిన టిక్ టాక్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొంత మందికి టిక్ టాక్ లకు లక్షల్లో వ్యూయర్ షిప్ వస్తోంది. అలాంటిది ఇక సెలబ్రిటీలు ఈ టిక్ టాక్ వీడియోలు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇండియాలో టిక్ టాక్ యాప్ సెలబ్రిటీల్లో సాహో భామ జాక్విలిన్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈమెకు టిక్ టాక్ లో 9.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సాహో సినిమాలో ప్రభాస్ తో కలిసి బ్యాడ్ బాయ్ పాటలో అందాలను ఆరబోసిన ఈ శ్రీలంక ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మొదటి సినిమా అలాద్దీన్ అంతగా ఆడ లేదు, కానీ ఆ తర్వాత వచ్చిన మర్డర్ టూ మంచి పేరు తెచ్చింది, అయితే ఆ సినిమా కూడా ఆమె పెద్దగా చేసిందేమీ లేదు, రెండు పాటలు నాలుగు ముద్దలతో అలరించింది. అయితే ఆ తర్వాత వచ్చిన రేస్ చిత్రంతో జాక్వెలిన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. టిక్ టాక్ విషయానికి వస్తేతరచుగా వెండితెర పై అందాలు ఆరబోయడంలో టిక్ టాక్ లో ఫాలోవర్లు కూడా భారీగా పెరుగుకుంటూ పోయారు. 2019 సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా బాగా పాపులారిటీ తెచ్చుకున్న 50 మంది జాబితాను టిక్ టాక్ విడుదల చేసింది. అందులో జాక్వలిన్ ఫెర్నాండెజ్ టాప్ స్థానంలో నిలిచింది. ఈమె టిక్ టాక్ వీడియోలను కోట్ల మంది వీక్షించడమే తనను మొదటి స్థానంలో నిలిపింది.