తారక్ రెండో కొడుకు ఫోటో వచ్చేసింది
on Jun 18, 2018
తారక్ - ప్రణతి దంపతులకు ఈ మధ్య రెండో కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే.. అయితే తారక్ రెండో కుమారుడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ దర్శనమిచ్చాయి.. కానీ అవన్నీ ఫేక్ ఫోటోలని తేలిపోయింది.. తాజాగా తారక్ తన ఇంస్టాగ్రామ్ లో మొదటి పోస్ట్ గా, కుమారుడి ఫోటోని పోస్ట్ చేసాడు.. 'కుర్చీలో కూర్చుని ఉన్న అభయ రామ్ ఒడిలో బుల్లి రాముడు ఉన్నాడు, ఇద్దరినీ తారక్ తన మొబైల్ లో ఫోటో తీస్తున్నాడు'.. ఈ ఫోటోని చూసి ఫ్యాన్స్ రామయ్యకి లవకుశలు అంటూ సంబర పడుతున్నారు.