టీజర్ రివ్యూ: హలో
on Nov 17, 2017
తన కొడుకు అఖిల్ తొలి సినిమా అఖిల్ అట్టర్ ఫ్లాప్ కావడంతో బాగా డిస్ట్రబ్ అయ్యారు కింగ్ అక్కినేని నాగార్జున. కొడుకు కెరీర్‌ను బాగా డిజైన్ చేయాలనుకున్న నాగ్ అందుకనే కొంతకాలం వెయిట్ చేసి.. ఎన్నో కథలను జల్లెడ పట్టి మూడు తరాల తన ఫ్యామిలీని సింగిల్ ఫ్రేమ్‌లో అందంగా చూపించిన విక్రమ్ కుమార్ చేతిలో అఖిల్ రెండో ప్రాజెక్ట్‌ను పెట్టాడు. వీరిద్దరి కాంభినేషన్లో తెరకెక్కుతున్న సినిమా "హలో".. రీసెంట్గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది యూనిట్. "ఒక్కసారి చిన్నతనంలో కలసిన మనసులు విడిపోవని.. అవి ఎప్పటికైనా తమ సోల్‌మేట్‌ను వెతుక్కుంటాయి" అంటూ నాగార్జున వాయిస్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది.
ఆ తర్వాత బిల్డింగ్స్ మీద నుంచి అఖిల్ దూకడం, చేజింగ్‌లు, జంపింగ్‌లతో యాక్షన్ సినిమానా అనిపిస్తుంది. చూస్తుంటే లవ్ ట్రాక్‌ని బేస్ చేసుకొని యాక్షన్ మోడ్‌లో మూవీని డిజైన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందజేస్తోన్న ఈ సినిమాలో అఖిల్ సరసన అలనాటి దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.