ట్రైలర్ రివ్యూ: డీజే
on Jun 11, 2017
హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే మూవీకి సంబంధించి కొద్ది రోజుల క్రితం థియెట్రికల్ ట్రైలర్ వచ్చింది. అయితే అభిమానులకు కానుకగా ఆడియో లాంఛ్ సందర్భంగా మరో ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఆ ట్రైలర్‌కు..ఈ ట్రైలర్‌కు తేడాలు గమనిస్తే..కొంచెం కొత్తగా ఉంది..రెగ్యులర్ కమర్షియల్ సినిమా కొలతలు, లెక్కల్ని హరీష్ శంకర్ పక్కాగా ఫాలో అయ్యాడు..దువ్వాడ జగన్నాథమ్‌గా, ఇటు డీజేగా బన్నీ లుక్స్, గెటప్, వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ అన్నీ అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎప్పటీలాగా రాకింగ్ స్టార్ దేవీశ్రీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పూజా గ్లామరస్‌గా కనిపించింది. అయితే బన్నీ రేంజ్ స్టెప్పులెక్కడా కనిపించకపోవడం పెద్ద మైనస్..మొత్తం మీద కొత్త ట్రైలర్..ఫ్యాన్స్‌కి మాత్రం పిచ్చగా నచ్చేయొచ్చు.