ఎన్ని ఆడియో లాంఛ్‌లు చేసినా..సుమకు ఇలాంటి గౌరవం దక్కలేదేమో
on Jun 11, 2017
తెలుగు బుల్లితెరపై మహారాణిగా వెలుగొందుతున్నారు యాంకర్ సుమ. టీవీ షోలైనా, ఆడియో లాంఛ్ లైనా సుమ ఉండాల్సిందే. స్టేజ్‌పై స్పాంటెనియస్గా జోకులు పేల్చి ఈవెంట్‌ను రక్తి కట్టిస్తుంటారు సుమ. అలాంటి సుమకి అదిరిపోయే బంపర్ ఫ్రైజ్ ఇచ్చారు నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్ హరీశ్ శంకర్. మ్యాటర్ ఎంటంటే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ డీజే. ఈ సినిమా ఆడియో లాంఛ్ హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా సుమ వ్యవహరించారు. రెండో సాంగ్ "మెచ్చుకో" లాంచ్ చేయాల్సిందిగా దిల్రాజును, హరీశ్ శంకర్‌ను స్టేజ్ మీదకు ఆహ్వానించింది సుమ. అయితే ఈ సాంగ్‌ను మా బదులు సుమ రిలీజ్ చేస్తారని చెప్పగానే స్టేజ్ మీదున్న ఆమెకు కాసేపు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత అభిమానుల చప్పట్ల మధ్య సుమ మెచ్చుకో సాంగ్‌ను విడుదల చేశారు. ఆ పాటను శ్రీమణి రాశారు.