ENGLISH | TELUGU  

"దిష్యూమ్" రివ్యూ!

on Jul 29, 2016

"దిష్యూమ్" రివ్యూ!

నటీనటులు:
జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్, జాక్వాలిన్ ఫెర్నాండెజ్, అక్షయ్ ఖన్నా తదితరులు..

సాంకేతికవర్గం:
సంగీతం: ప్రీతమ్ చక్రవర్తి
ఛాయాగ్రహణం: ఆయనాంక బోస్
నిర్మాణం: నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్మెంట్
దర్శకత్వం: రోహిత్ ధావన్
విడుదల తేదీ: 29/7/2016

జాన్ అబ్రహాం-వరుణ్ ధావన్ హీరోలుగా రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "డిష్యూమ్". ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో జాక్వలిన్ కథానాయికగా నటించగా.. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ నర్గీస్ ఫక్రి, పరిణీతి చోప్రాలు ప్రత్యేక పాత్రల్లో మెరిసిన ఈ చిత్రం నేడు (జూలై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ:
సరిగ్గా 48 గంటల్లో పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్ లో తలపడాల్సిన భారత్ టీమ్ లోని కీ ప్లేయర్ అయిన విరాజ్ శర్మ కిడ్నాప్ అవుతాడు. విరాజ్ ను వెతికి పట్టుకోవడానికి ఇండియన్ ఎంబస్సీ కబీర్ (జాన్ అబ్రహాం)ను దుబాయ్ పంపుతుంది. అక్కడ పాకిస్థానీ పోలీస్ అయిన జునైద్ తో కలిసి కబీర్ క్రికెటర్ విరాజ్ కోసం వెతకడం మొదలుపెడతాడు.
అసలు విరాజ్ ను కిడ్నాప్ చేసింది ఎవరు?
కబీర్-జునైద్ లు విరాజ్ ను కాపాడగలిగారా? లేదా? అనేది "డిష్యూమ్" చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు:
జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్ లు సిక్స్ ప్యాక్ బాడీలతో యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించారు. జాన్ సీరియస్ లుక్స్ తో ఆకట్టుకోగా.. వరుణ్ ధావన్ మాత్రం కామిక్ టైమ్ తో నవ్వించగలిగాడు. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ లు లేకపోవడం ఈ సినిమాకి చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ లో మరొకటి.
నెగిటివ్ క్యారెక్టర్ లో అక్షయ్ ఖన్నా ఫర్వాలేదనిపించుకోగా.. క్యారెక్టర్ లేని కథానాయికగా జాక్వలిన్ అందాలు ఉదారంగా ఆరబోయడం మినహా మరేమీ చేయలేదు. మిగిలిన నటీనటులు ఓ మోస్తరుగా నటించి బొటాబోటి మార్కులతో సరిపెట్టుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు:
ప్రీతమ్ సమకూర్చిన బాణీలు, అభిజిత్ అందించిన నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. థీమ్ మ్యూజిక్ మరో హైలైట్.
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, విఎఫ్.ఎక్స్ వంటివి నిర్మాణ విలువల్ని చాటి చెప్పాయి.

సినిమాలో పెద్ద మైనస్ అంటే.. లాజిక్ లేకపోవడమే. అసలు కథలోని ట్విస్టులు ఎవరు, ఎప్పుడు ఎలా రివీల్ చేస్తున్నారో అస్సలు అర్ధమే కాదు. దర్శకుడు రోహిత్ ధావన్ ఫెయిల్ అయ్యింది ఈ విషయంలోనే. కథ గ్రిప్పింగ్ గా రాసుకొన్నప్పటికీ.. కథనం మాత్రం సరిగా నడిపించలేకపోయాడు. అందువల్ల కథలో క్లారిటీ ఉన్నా.. కథనం మాత్రం సరిగా ఆకట్టుకోలేక చతికిలపడుతుంది. ముఖ్యంగా హీరోల మధ్య కెమిస్ట్రీ ఆంగ్ల చిత్రం "బ్యాడ్ బాయ్స్"లోని హీరోల క్యారెక్టరైజేషన్ ను తలపించడం గమనార్హం.

విశ్లేషణ:
పేరుకు తగ్గట్లుగా సినిమా మొత్తం "డిష్యూమ్, డిష్యూమ్" అన్నట్లుగా ఫుల్ యాక్షన్ తో సాగుతుంది. కాకపోతే.. లాజిక్ అనేది బూతద్దం పెట్టి వెతికినా దొరకదు. సో, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకొనే అవకాశాలు లేవు. ఇక మాస్ ఆడియన్స్ మాత్రమే ఈ చిత్రాన్ని బ్రతికించాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కే భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా లాజిక్ లేకపోవడం బాధాకరం. అయితే.. సగటు ప్రేక్షకుడు సినిమాలో కోరుకొనేది ఎంటర్ టైన్మెంట్ కాబట్టి "డిష్యూమ్" సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.


రేటింగ్: 2.5/5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.