రాజమౌళికే పాఠాలు నేర్పిన క్రిష్
on Jan 16, 2017
గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చూసినవాళ్లంతా... క్రిష్‌కి ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఇది కదా.. మన తెలుగు సినిమా అంటూ... కాలర్లు ఎగరేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించాడు.. సాయిమాధవ్ బుర్రా గొప్ప డైలాగులు రాశారు.. కానీ అన్ని శాఖల్నీ సమన్వయ పరచుకొని, అందరి భారాల్నీ భుజాలమీద మోసిన క్రిష్‌దే ఈ క్రెడిట్ అంతా! ఇది దర్శకుడి సినిమా అంటూ... గొప్పగా చెప్పుకొనే స్థాయి సంపాదించుకొన్నాడు క్రిష్. గౌతమి సినిమా చూశాక క్రిష్‌ని పొగిడిన వాళ్లే.. `రాజమౌళి`పై గురి పెడుతున్నారు.
ఇంత తక్కువ టైమ్‌లో, తనకున్న తక్కువ బడ్జెట్లో క్రిష్ ఇంత పెద్ద కాన్వాస్ ఉన్న సినిమాని పూర్తి చేసినప్పుడు రాజమౌళి మాత్రం ఏళ్లకు ఏళ్లు ఎందుకు తీస్తున్నాడన్నదే ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తక్కువ టైమ్‌లో... తక్కువ బడ్జెట్లో ఇంత గొప్పగా సినిమా తీయడం.. క్రిష్‌కి సాధ్యమైనప్పుడు రాజమౌళి మాత్రం బాహుబలి తీయడానికి మూడేళ్లు ఎందుకు తీసుకొన్నాడన్నది అందరి ప్రశ్న! ఈ విషయంలో రాజమౌళి కూడా క్రిష్‌ని చూసి నేర్చుకోవాల్సిందే. క్రిష్ అనుకొంటే ఈ సినిమాని మరో యేడాది పాటు లాగి.. లాగి ల్యాగ్ చేయొచ్చు. బాహుబలిలానే ఈ సినిమాకీ హైప్ పెంచుకోవొచ్చు. కానీ క్రిష్ అలా చేయలేదు.
ఈ సినిమాకి ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువే పడి... అనుకొన్న సమయానికి సినిమా విడుదల చేశాడు. ఔరా.. అనిపించుకొంటున్నాడు. క్రిష్ లా ఆలోచిస్తే రాజమౌళి కూడా ఈపాటికి బాహుబలి లాంటి సినిమాల్ని ఐదో ఆరో తీసేద్దుడు. గౌతమి పుత్ర చూశాకైనా రాజమౌళి మారితే అదే పది వేలు.