పురుషుడు గర్భం దాలిస్తే?
on Aug 13, 2020
భూమ్మీదకు మరో మనిషిని తీసుకొచ్చే వరం భగవంతుడు మహిళలకు ఇచ్చాడు. 'దేన్ని అయినా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి... నెలకి. రెండు... ఆడవాళ్ళకి' అని 'అల వైకుంఠపురములో' సినిమాలో త్రివిక్రమ్ చెప్పారు. మహిళ మరో బిడ్డకు జన్మనివ్వడం ప్రకృతి సహజం. ఒకవేళ పురుషుడు జన్మ ఇస్తే? పురుషుడు గర్భం దాలిస్తే? ఈ పాయింట్ మీద బాలీవుడ్లో సినిమా తెరకెక్కనుందని ముంబై టాక్.
మేల్ ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్ మీద దర్శకుడు షాద్ అలీ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట. అందులో పంజాబీ గాయకుడు, హీరో దిల్జీత్ దొసాంజ్ యాక్ట్ చేయనున్నాడని టాక్. ప్రజెంట్ పంజాబీలో మేల్ ప్రెగ్నెన్సీ మీద ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. కాన్సెప్ట్ ఒక్కటే తప్ప, రెండిటికీ చాలా వ్యత్యాసం ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మార్చికి ముందు అమెరికా వెళ్లిన దిల్జీత్ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. అతడు తిరిగొచ్చిన తరవాత షూటింగ్ షెడ్యూల్స్, డేట్స్ గట్రా డిస్కస్ చేస్తారట.