రానా... రాక్షసుడులా ఉన్నాడేంటి?
on Sep 27, 2019
హిందీ సినిమా ‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ శుక్రవారం మధ్యాహ్నం విడుదలైంది. ప్రజెంట్ తెలుగులో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే ఈ సినిమాలో ఓ హీరోయిన్. మహేశ్‌బాబుతో ‘వన్ నేనొక్కడినే’లో, నాగచైతన్యతో ‘దోచెయ్’లో యాక్ట్ చేసిన కృతీ సనన్ మరో హీరోయిన్. పవన్ కల్యాణ్ ‘తీన్మార్’లో నటించిన సెకండ్ హీరోయిన్ కృతీ కర్భందా ఇంకొక హీరోయిన్. రెండు రోజుల క్రితం విడుదలైన స్టిల్స్‌లో ముగ్గురూ హాట్ హాట్‌గా కనిపించడంతో తెలుగు ఆడియన్స్ కన్ను ఈ సినిమా ట్రైలర్‌పై పడింది. అందులో హీరోయిన్ల కంటే ఎక్కువ ఎట్రాక్ట్ చేసింది మాత్రం రానా దగ్గుబాటి. ట్రైలర్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అతణ్ణి గుర్తుపట్టడం కష్టమే. ఎందుకంటే... అతడి లుక్ కాలకేయలా ఉంది మరి! ‘బాహుబలి’లో భల్లాలదేవగా నటించిన రానా... పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే ఓ క్యారెక్టర్‌ను రానా చేశాడు. ట్రైలర్లో అతణ్ణి చూపించారు. ఏదో గుహల్లో క్రూరమృగంతో తలపడే మానవమృగంలా ఉన్నాడు. సినిమాలో రానా క్యారెక్టర్ లెంగ్త్ ఎంత ఉంటుందో కానీ... ఉన్నంతసేపూ యాక్టింగ్ ఇరగదీసేలా ఉన్నాడు.
Also Read