వయసు 28ప్లస్... సంపాదన 68ప్లస్!
on Aug 24, 2016
డబ్బుతో కొనలేనివి చాలా వుంటాయి అంటారు చాలా మంది! కాని, దాంట్లోని గూడార్థం ఏంటంటే... డబ్బుతో కొనలేని ఆ కొన్ని తప్ప... మిగతావన్నీ డబ్బుతో కొనచ్చనే! ఈ ఎకనమిక్స్ బాగా తెలుసు కాబట్టే దీపిక పదుకొనే కోట్లకు కోట్లు వెనకేసుకుంటుంది! ఓ బాలీవుడ్ హీరోయిన్ కి , అదీ డిప్స్ లాంటి టాప్ స్టార్ కి డబ్బులు రావటం పెద్ద ఆశ్చర్యమేం కాదు. కాని, లెటెస్ట్ బజ్ ఏంటంటే, దీపికా టాప్ టెన్ లిస్ట్ లో చేరింది. అదీ అల్లాటప్పా లిస్ట్ కాదు. హాలీవుడ్ హాట్ హీరోయిన్స్ తో పొటిపడాల్సిన ఫోర్బ్స్ హయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెసెస్ లిస్ట్! అందులో పదో స్థానం స్వంతం చేసుకుంది మన మంగళూరు బ్యూటీ... పదో స్థానం అనగానే పెదవి విరవకండి. ఎందుకంటే, అసలు ఫోర్బ్స్ లిస్ట్ లో వున్న ఏకైక ఇండియన్ బేబ్ దీపికానే. మిగతా అందరూ హాలీవుడ్ ఇంటర్నేషనల్ స్టార్స్. వాళ్లతో పోటీపడి మన దీపిక టాప్ టెన్త్ పొజీషన్ కైవసం చేసుకుంది. దీపికా పదుకొనే ఫోర్బ్స్ లిస్ట్ లో చేరటానికి ఆమె రీసెంట్ గా ఇచ్చిన హాలీవుడ్ ఎంట్రీ కూడా కారణం అనొచ్చు. అయితే, ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్, ఇంకా కమర్షియల్ ఎండార్స్ మెంట్స్ తో దూసుకుపోతున్న దీపు సంవత్సర సంపాదన ఎంతో తెలుసా? మన రూపాయల లెక్కల్లో మాట్లాడుకుంటే... 68కోట్లు!