భారతీయ సినిమాని పొగిడిన చైనా అధ్యక్షుడు
on Jun 10, 2017
మే 5కి చైనాలో విడుదలయిన ఆమిర్ ఖాన్ దంగల్ చిత్రం ఇప్పటికే దాదాపు 1100 కోట్లు కొల్లగొట్టి, ప్రస్తుతం 7000 ల స్క్రీన్స్ లో దిగ్విజయంగా ప్రదర్షింపబడుతుంది. నాన్-హాలీవుడ్ రికార్డు ని బద్దలు కొట్టి, చైనా లో బిలియన్ యువాన్లు కలెక్ట్ చేసిన 33 వ సినిమాగా నిలిచింది. ఆమిర్ ఖాన్ సైతం ఊహించని ఘన విజయం ఇది. తాను చైనాలో బాగా ఆడుతుందని ఊహించానని... కానీ ఇంతలా ఆదరించబడుతుందని అనుకోలేదని ఆమిర్ ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. ఇదిలా ఉంటే, తన సహచరుల ద్వారా తెలుసుకున్నాడో ఏమో కానీ... చైనా అధ్యక్షుడు జీ జింపింగ్ కూడా దంగల్ సినిమా చూసాడు. అంతేనా, నిన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో పాల్గొన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తో దంగల్ సినిమా గురించి అందులో నటించిన ఆక్టర్స్ గురించి ప్రత్యేకంగా చర్చించాడంట.
ఈ విషయాన్నీ ఫారిన్ సెక్రటరీ జయ్ శంకరే స్వయంగా తెలిపారు. దంగల్ చైనాలో బాగా ఆడుతుందని తనకి సినిమా పిచ్చ పిచ్చగా నచ్చిందని... అందరు నటీనటులు అద్భుతంగా నటించారని జింపింగ్ అన్నారట. ఈ మధ్య భారతీయ సినిమాలు బాగా ఉంటున్నాయని తన అభిప్రాయం వ్యక్త పరిచాడట. ఇది విన్న మోడీ సంతోషానికి అవధులు లేకుండా పోయిందట. మరి మన దేశం గురించి ఇక్కడి గొప్పదనం గురించి వేరే వాళ్లు అందులోను పర దేశ అధ్యక్షుడు మంచిగా మాట్లాడడం ఎవరికీ మాత్రం సంతోషాన్నివ్వదు...
Also Read