నాగబాబు చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి
on Apr 29, 2017
మెగాస్టార్ చిరంజీవి అంటే మెగా ఫ్యామిలీ లోనే కాదు సినీ ప్రియులకి కూడా అభిమానం ఎక్కువ. లేటు వయసులో కూడా ఖైదీ నం 150 సక్సెస్ తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. త్వరలో స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత గాథ లో నటించనున్న చిరు, ప్రస్తుతం తన టీవీ షో మీలో ఎవరు కోటీశ్వరుడు తో బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఈ వారం చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. సినిమా విశేషాలే కాకుండా, పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలు కూడా నెమరు వేసుకొని, ఒకింత ఉద్వేగానికి కూడా లోనయ్యారు. అయితే, ఈ సందర్భంగా చిరంజీవి తమ చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకున్నారు.
తాను ఎప్పుడూ అమ్మకి ఇంటి పనుల్లో సహాయం చేస్తూంటే... నాగబాబు మాత్రం చిన్నప్పుడు బాగా సోమరి అని... ఎప్పుడు పడుకునే ఉండేవాడని... ఏ పనీ చేసేవాడు కాదని చెప్పాడు. ఒకసారి నాగబాబుని లాండ్రీ నుండి బట్టలు తెమ్మని పంపిస్తే వెళ్లడం మానేసి ఇంట్లోనే ఎంచక్కా పడుకునే ఉన్నాడని, తనకి విపరీతమైన కోపం వచ్చి చెంప చెళ్లుమనిపించానని చెప్పాడు. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి చిరంజీవి కి తమ్ముణ్ణి అలా కొడతావా అని క్లాస్ పీకిందని చెప్పుకొచ్చాడు. తర్వాత ఇదే విషయాన్నీ తమ తండ్రికి వివరించగా, తాను నాగబాబుని మరో దెబ్బ కొంచెం గట్టిగానే కొట్టాడని చెప్పాడు. చిరంజీవి నిజంగా కష్టజీవి కాబట్టే ఈ రోజు మెగాస్టార్ అవ్వగలిగాడు. ఆ తరానికీ, ఈ తరానికీ ఆదర్శప్రాయుడయ్యాడు.
Also Read