సినిమానే కాదు షో ని వదలట్లేదు..!!
on Jul 23, 2018
ఎంతో వ్యయంతో చిత్రాన్ని నిర్మిస్తుంటే ఎవరొకరు దానిలో సన్నివేశాలు లీక్ చేస్తే ఆ నిర్మాత పరిస్థితి ఏంటో ఇప్పటికే మనకు అర్థమైంది.ఈ లీకుల పరంపర సినిమాకే అనుకుంటే పొరపాటే.తెలుగు లో భారీ వ్యయం తో ప్రతిష్టాత్మకంగా నిర్వహస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్.ఈ షో కి కూడా లీకులతో తంటా తప్పట్లేదు. ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే విషయం అందరికి తెలిసిందే. ఆదివారం జరిగే ఎలిమినేషన్ కి సోమవారం నుంచి శుక్రవారం వరకు వోటింగ్ ఉంటుంది. కానీ ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది, అందుకు తగ్గట్లే తూచా తప్పకుండా జరుగుతోంది.
గత వారం మాదిరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం శుక్రవారం రాత్రికే సోషల్ మీడియాలో వచ్చేసింది.దీనికి తగ్గట్లే ఆదివారం రాత్రి ప్రకటించిన ఎలిమినేషన్ లో తేజస్వి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.బిగ్ బాస్ హౌస్ కు సంబంధించి ప్రతిదీ గోప్యంగా ఉంచుతున్నప్పటికీ ఎలా లీక్ అవుతుందో తెలియక తలమునకలవుతున్నారు. ఇకపోతే ఈ వారం వైఫ్ ఆఫ్ రామ్ ప్రమోషన్లో భాగంగా మంచు లక్ష్మీ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలిపే బాధ్యత లక్ష్మికి అప్పగించారు. లక్ష్మి నేను కూడా షో చూస్తున్న అనటంతో ఆమెకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు.నాని బిగ్ బాస్ ఇంట్లో సభ్యుల మాదిరి ఇమిటేట్ చేస్తుంటే.. లక్ష్మీ మంచు గుర్తు పట్టాలి. ఈ టాస్క్ లో అందరిని ఆమె గుర్తు పట్టారు. దీంతో సామాన్యులే కాదు,ప్రముఖులు సైతం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు అనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.