బిగ్ బాస్-2 షుగర్ లెస్ టీ...!
on Jun 11, 2018
బిగ్ బాస్.. తెలుగులో మొదటి రియాలిటీ షో.. స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ కావడంతో ఈ షో కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూసారు.. ఎన్టీఆర్ కూడా తన టైమింగ్, అల్లరితో ఆడియెన్స్ అంచనాలని అందుకుంటూ షో ని పెద్ద హిట్ చేసాడు.. దాంతో బిగ్ బాస్-2 కోసం ఆడియెన్స్ రెట్టింపు ఉత్సహంతో ఎదురు చూసారు.
కానీ అనుకోకుండా ఎన్టీఆర్ ప్లేస్ లో నాని హోస్ట్ గా వచ్చాడు.. ఈసారి ఇంకొంచెం మసాలా అన్నాడు.. దాంతో నాని యాంకరింగ్ ఎలా ఉంటుంది? మసాలా ఎంత ఉంటుంది? అనుకుంటూ ఆడియెన్స్ బిగ్ బాస్-2 ఫస్ట్ ఎపిసోడ్ ఆసక్తిగా చూసారు.. మరి ఆ ఆసక్తి ఆనందంగా మారిందా? అంటే లేదనే కామెంట్సే వినిపిస్తున్నాయి.. ఒకరిద్దరు తప్ప కంటెస్టెంట్స్ పెద్దగా తెల్సినవాళ్ళు కాకపోవడంతో ఆడియెన్స్ కాస్త నిరాశ చెందారు.
దానికి తోడు నాని యాంకరింగ్ కూడా చప్పగా సాగిందని కామెంట్స్ వస్తున్నాయి.. ఇక సోషల్ మీడియాలో బిగ్ బాస్-2 ఫస్ట్ ఎపిసోడ్ గురించి విపరీతమైన సెటైర్స్ వస్తున్నాయి.. 'ఈసారి బిగ్ బాస్ లో ముగ్గురు కామన్ మేన్లు ఉంటారన్నారు.. కంటెస్టెంట్స్ ని చూస్తుంటే ముగ్గురే సెలబ్రిటీలు ఉన్నట్టున్నారు' అని ఓ సెటైర్ వినిపిస్తుంది.. అలానే ' మసాలా.. మసాలా.. అంటే ఫస్ట్ ఎపిసోడ్ మసాలా టీ లాగా ఉంటుంది అనుకున్నాం.. కానీ షుగర్ లెస్ టీ లాగా ఉంది' అంటూ మరో సెటైర్ వినిపిస్తుంది.. దీన్నిబట్టి బిగ్ బాస్-2 ఫస్ట్ ఎపిసోడ్ ఆడియెన్స్ అంచనాలను అందుకోలేదని తెలుస్తుంది.. కనీసం నెక్స్ట్ వీకెండ్ నుండైనా నాని తన కామెడీ టైమింగ్, అల్లరితో ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది.. లేదంటే బిగ్ బాస్-2 కాస్తా బిగ్ బోర్-1 గా మిగిలిపోతుంది.. చూద్దాం ఏం జరుగుతుందో.
Also Read