సంక్రాంతికే బాలయ్య సినిమా!
on Jul 27, 2016
నందమూరి బాలకృష్ణ తన వందో సినిమా షూటింగ్‌ను చకా చకా కానిచ్చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ స్టార్ట్ అయినా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఇటీవల ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ పెళ్లి సందర్భంగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చేవరకు గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్‌కు బ్రేక్ రావడంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరిలోను ఉత్కంఠ నెలకొంది. అయితే శాతకర్ణి రిలీజ్‌డేట్‌పై ఉన్న సస్పెన్స్‌ను దర్శకుడు క్రిష్ రివీల్ చేసేశాడు. బాలయ్య సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ఓ కార్యక్రమంలో ఎనౌన్స్ చేశాడు. శాతకర్ణి ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే 12 జనవరి 2017న విడుదల చేస్తామని చెప్పాడు. దీంతో సంక్రాంతి బరిలో బాలయ్య దిగడం ఖాయమనిపిస్తోంది.