బాలకృష్ణ సినిమా టైటిల్ మారుతుందా?
on Jul 6, 2020
సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ 'సింహ', 'లెజెండ్' తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ, భారీ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ టీజర్ విడుదల అయ్యింది. ఆడియన్స్ ని ఆకట్టుకుంది. టైటిల్ లేకుండానే 'బిబి3' (బాలకృష్ణ బోయపాటి మూడో సినిమా) పేరుతో టీజర్ విడుదల చేశారు. అయితే, సినిమాకు 'మోనార్క్' టైటిల్ కన్ఫర్మ్ చేశారని యూనిట్ వర్గాలు వ్యాఖ్యానించాయి.
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... మోనార్క్ టైటిల్ కాకుండా మరో టైటిల్ కోసం బోయపాటి శ్రీను చూస్తున్నారట. మోనార్క్ అంటే నెగిటివ్ సౌండింగ్ వస్తుందని నందమూరి అభిమానులు చెప్పడంతో 'సూపర్ మాన్' టైటిల్ ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. అదీ కాకపోతే మరో టైటిల్ రావచ్చు. ఈ సినిమా హీరోయిన్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మలయాళీ బ్యూటీ అమలాపాల్ హీరోయిన్ల రేసులో ముందు ఉందట.