బాహుబలిని 'కామెడీ' చేసేశారా?
on Apr 27, 2017
బాహుబలి 2 ఎలా ఉండబోతోందన్న ఊహలకు, అంచనాలకు, ఆశలకు మరి కాసేపట్లో తెర పడబోతోంది. ఈలోగా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. బాహుబలి 2లో కొత్తగా ఏం ఉండబోతోంది అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. బాహుబలి 2లో కొత్తగా కామెడీ ట్రై చేశారని ఈ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళినే చెప్పేశాడు. తొలి భాగమంతా యుద్దాలు, ఎమోషన్ సన్నివేశాలతో నిండిపోయింది. ఫస్ట్ పార్ట్‌లో కామెడీకి చోటే లేకుండా పోయింది. నిజంగా ఆ దిశగా రాజమౌళి ఆలోచించలేదు. కానీ పార్ట్ 2లో మాత్రం అందుకు అవకాశం దొరికిందట.
పార్ట్ 1 లో లేకుండా పార్ట్ 2లో కనిపించే పాత్ర సుబ్బరాజుదే. కాబట్టి ఆ పాత్ర చుట్టూనే రాజమౌళి కామెడీ పండించాడని టాక్. అయితే.. స్టూడెంట్ నెం.1 నుంచి చూస్తే.. రాజమౌళి సినిమాల్లో కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఏదో ట్రై చేస్తాడు గానీ.. అంతంత మాత్రంగా నవ్వులు పండాయంతే. ఇప్పుడు బాహుబలిలోనూ రాజమౌళి కామెడీ ట్రై చేశాడంటే.. ఏదో తేడా కొడుతోంది. ఆ సీన్లు పండకపోతే.. అది బాహుబలి 2 సినిమాపైనే ఎఫెక్ట్ తీసుకొచ్చే ప్రమాదం ఉంది. రాజమౌళికి అచ్చిరాని జోనర్లో సీన్లు ఎక్కువైతే.. బాహుబలి ఫలితం తేడా కొట్టేసినట్టే.