అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి..!
on Jun 29, 2016
పాపం ఏ ముహూర్తాన "సైజ్ జీరో" సినిమా కోసం బాగా కష్టపడి అనుష్క ఒళ్ళు భారీగా పెంచిందో తెలియదుగానీ.. అప్పట్నుంచి ఆ పెరిగిన కొవ్వును కరిగించుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఇటీవల ఫిలిమ్ ఫేర్ అవార్డ్ వేడుకలో అనుష్కను చూసివారందరూ "బాబోయ్" అనేశారు. "బాహుబలి 2" కోసం అనుష్క తగ్గుతోందని, ఇప్పటికే ఓ పాతిక కిలోల బరువు తగ్గిందని వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అర్ధమైపోయింది. కేవలం ఈ భారీ పర్సనాలిటీ కారణంగానే మెగా 150వ సినిమాలో నటించే సువర్ణావకాశాన్ని సైతం అనుష్క పోగొట్టుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
అయితే.. అనుష్క ఇప్పుడు ఉన్నపళంగా లావు తగ్గాలంటే "లైపో" ఒక్కటే గతి. కానీ, అనుష్కకు అలా తగ్గడం ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే యోగాతోపాటు ఎక్సర్ సైజులు చేస్తూనే మెడికేషన్ తీసుకొంటోందట. "బాహుబలి 2" షూటింగ్ శరవేగంగా జరుగుతుండడం, "దేవసేన" క్యారెక్టర్ లో కనబడాలంటే స్వీటీ అర్జెంటుగా ఓ పది కేజీలైన తగ్గాలని రాజమౌళి సూచించడంతో అనుష్క ఆహారహం శ్రమిస్తోందని సమాచారం. మరి రాజమౌళి కోరినట్లుగా అనుష్క బరువు తగ్గుతుందో లేదో చూడాలి!