English | Telugu

అనుష్క శర్మ పెళ్లి రోజు బట్టల కాస్ట్ ఎంతో తెలుసా..?

on Dec 13, 2017

పెళ్లై నాలుగు రోజులు గడుస్తున్నా అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ పెళ్లి కబుర్లకు ఫుల్‌స్టాప్ మాత్రం పడటం లేదు. పెళ్లికి ఎవరెవరు వచ్చారు.. అనుష్కకు విరాట్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు.. పెళ్లిలో కోహ్లీ ఏం పాట పాడాడు.. ఇలా చాలా విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు గూగుల్‌ని జల్లెడ పడుతున్నారు. ఇప్పుడు వీరి కన్ను విరుష్క పెళ్లి బట్టలపై పడింది. అయితే అందుకు సంబంధించిన సమాచారం ఎక్కడా దొరకడం లేదు. ఫ్యాన్స్ బాధను అర్ధం చేసుకున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ పెళ్లిలో వధూవరులు ధరించిన దుస్తుల గురించి వెల్లడించారు.

అనుష్క వెడ్డింగ్ డే నాడు ధరించిన లెహంగాను 67 మంది కళాకారులు 32 రోజుల పాటు శ్రమించి తయారు చేశారట. పేల్ పింక్ కలర్‌ లెహంగాపై వింటేజ్ ఇంగ్లిష్ రంగులతో సిల్వర్- గోల్డ్ మెటల్ దారాన్ని ఉపయోగించి ఎంబ్రాయిడరీ చేశామని.. ఇందులో అన్‌కట్ డైమెండ్స్, ముత్యాలు, పూసలు గుచ్చినట్లు సవ్యసాచి తెలిపారు. విరాట్ వేసుకున్న ఐవరీ రా సిల్క్ షేర్వాణి కూడా ప్రత్యేకంగా తయారు చేశామని .. దీనిలో బనారసీ ప్యాటర్న్‌ను చేతితో ఎంబ్రాయిడరీ చేశామన్నారు. దుస్తుల డిజైన్‌ను ఎలా చేసింది..? ఏం వాడింది చెప్పిన ఆయన వాటి ఖరీదును మాత్రం చెప్పలేదు. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here