పూరికి దేశముదురు ప్రశంస
on Aug 13, 2020
హార్డ్ హిట్టింగ్ డైలాగులు రాయడం లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దిట్ట. తను చెప్పాలనుకున్న అంశాన్ని చాలా బలంగా, సూటిగా, స్పష్టంగా చెబుతారు. సమాజంలోని పలు అంశాలపై సినిమాలలో తనదైన శైలిలో పూరిజగన్నాథ్ స్పందించారు. ఇప్పుడు పాడ్ కాస్ట్ లో అకౌంట్ ఓపెన్ చేసి పలు అంశాలపై స్పందిస్తున్నారు. పూరి అభిప్రాయాలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
వెండితెరపై పూరి జగన్నాథ్ 'దేశముదురు'గా చూపించిన అల్లు అర్జున్ ను సైతం ఆయన పాడ్ కాస్ట్ పోస్టులు ఆకట్టుకున్నాయి. దాంతో పూరి ని ప్రశంసిస్తూ బన్నీ ఓ ట్వీట్ చేశారు. "పూరి గారూ... అద్భుతమైన అంశాలపై నిజాయితీగా హార్డ్ హిట్టింగ్ ఒపీనియన్స్ చెబుతున్నారు. వ్యక్తిగతంగా నాకు చాలా బాగా నచ్చాయి. మీకు నా ప్రేమను పంపిస్తున్నా. ఇటువంటి అందమైన మరిన్ని అంశాలపై మీ అభిప్రాయాలు వస్తాయని ఆశిస్తున్నా" అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.