అందరికీ `అల్లరి` థ్యాంక్స్!!
on May 10, 2019
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన `మహర్షి` సినిమా ఈ గురువారం వరల్డ్ వైడ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. యావరేజ్ టాక్ తో దూసుకెళ్తోన్న ఈ సినిమా లో అల్లరి నరేష్ ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే నరేష్ క్యారక్టర్ కు అటు ప్రేక్షకులు నుంచి ఇటు విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో నరేష్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సందర్భంగా మీడియాకు, సినీ పరిశ్రమకు , ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ ఒక ప్రెస్ నోట్ పంపించాడు. `` నా 55 సినిమాల జర్నీ నా లైఫ్ లో ఎన్నో జ్ఞాపకాలను నింపిందీ, నేను ఇంతవాణ్ని అవడానికి కారణమైన చిత్ర పరిశ్రమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 17 ఏళ్లుగా ఆదరిస్తోన్న చిత్ర నిర్మాతలకు, దర్శకులకు , సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు నరేష్.