ఇలియానా కోసం పాటుపడుతున్న అక్షయ్ కుమార్!
on Jul 28, 2016
ప్రెజంట్ జనరేషన్ హీరోలు తాము నటిస్తున్న సినిమాకి ప్రమోషన్ చేయమంటేనే సింపుల్ గా "నో" చెప్పేసి.. నామమాత్రానికి ఆడియో వేడుకకి రావడం, ఒక పర్సనల్ ఇంటర్వ్యూ లాంటివి ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. కానీ.. బాలీవుడ్ లో అలా కాదు బడ్జెట్, స్టార్ క్యాస్ట్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క హీరో/హీరోయిన్ తమ సినిమాను కుదిరినంతలో ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మిగతా స్టార్ల గురించి తెలియదుకానీ.. అక్షయ్ కుమార్ మాత్రం తన ప్రతి సినిమా విడుదల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటుంటాడు.
తన తాజా చిత్రం "రుస్తుం" కోసం ఒక అడుగు ముందుకేసి తన కోసం, తన సినిమా కోసమే కాకుండా.. తన సినిమా హీరోయిన్ ఇలియానా గురించి కూడా ప్రమోషన్ చేస్తున్నాడు. ఒక హిందీ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసినా సరే తెలుగు మీడియాలో ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ తారలు ముందుకురారు. కానీ.. అక్షయ్ కుమార్ మాత్రం తన హీరోయిన్ ఇలియానా తెలుగులో మళ్ళీ ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్ట్ 12న విడుదలకానున్న "రుస్తుం" సినిమా కోసం జీతెలుగులో వచ్చే "కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను" షో కోసం టైమ్ కేటాయించి ఇలియానాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ బూస్టప్ తో ఇలియానాకు తెలుగులో ఏమైనా ఆఫర్లు వస్తాయేమో చూడాలి!