అడివి శేష్ గుట్టు బయటపడింది!!
on Feb 20, 2019
అవును `గూఢచారి` సినిమాతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా చిగురించింది. ఆ ప్రయాణం సహజీవనంగా మారింది. ఆ సహజీవనం ఇప్పుడు ఏడడుగుల బంధంగా మారనుంది. ఇదంతా ఎవరి గురించి అనకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.... అక్కినేని మేనకోడలు సుప్రియ-అడివి శేష్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గత కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారట. `గూఢచారి` చిత్రం సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టిందట. సుప్రియకు గతంలో పెళ్లి జరిగినా ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఇక ఇటీవల అడివి శేష్ కూడా త్వరలోనే ఒక అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నెటి జన్లు `పెళ్లి వార్త చెప్పబోతున్నావా? అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో నిజంగానే అడివి శేష్ పెళ్లి వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే సుప్రియతో అడివి శేష్ పెళ్ళికి ఇరు వైపులా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలో రాబోతుందని సమాచారం. ఈ పెళ్ళి వ్యవహారాలన్నీ సమంత దగ్గరుండి చూసుకోనుందట. మొత్తానికి అడివి శేష్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడన్నమాట.